Aug 07,2022 22:31

ఫొటో : మాట్లాడుతున్న సిడిపిఒ తేజస్విని

ఫొటో : మాట్లాడుతున్న సిడిపిఒ తేజస్విని
ముగిసిన తల్లిపాల వారోత్సవాలు
ప్రజాశక్తి-ఉదయగిరి : ఆగస్టు ఒకటోతేదీ నుండి ప్రారంభమైన అంగన్‌వాడీ తల్లిపాల వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయగిరి అంగన్‌వాడీ ప్రాజెక్టు పరిధిలో ఇన్‌ఛార్జ్‌ సిడిపిఒ తేజస్విని ఆధ్వర్యంలో ప్రారంభమైన తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలు అన్ని చోట్ల నేటితో ఘనంగా ముగిశాయి. చివరి రోజు సీతారాంపురం మండలం సంజీవరెడ్డి నగర్‌ సెక్టార్లో ముగింపు వారోత్సవాలను ఆ సెక్టార్‌ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలతో నిర్వహించారు. బాలింతలను, గర్భిణులకు తల్లిపాల ఆవశ్యకత గురించి వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల ద్వారా అందించే సేవలను వివరించారు. కార్యక్రమంలో అయ్యవారిపల్లి హెచ్‌డబ్ల్యూ కార్యకర్త లక్ష్మిదేవీ, వడ్లవారిపల్లి బి.రత్నమ్మ, అయ్యవారిపల్లి మెయిన్‌ ఎస్‌డి.మస్తాన్‌ బి, దేవిశెట్టిపల్లి ఎన్‌.రాధ, సోంపల్లి ఎన్‌.శారాల, బాలింతలు, గర్భిణులు, గ్రామస్తులు పాల్గొన్నారు.