Oct 28,2021 17:11

ముంబయి : ముంబయి డ్రగ్స్‌ కేసులో అరెస్టు అయిన ఆర్యన్‌ ఖాన్‌కు ఎట్టకేలకు ముంబయి హైకోర్టులో బెయిల్‌ మంజూరు అయింది. మూడు రోజులుగా ఈ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. మూడు వారాల తర్వాత గురువారం ఆర్యన్‌ ఖాన్‌కు, అర్బాన్‌ మర్చంట్‌, మున్‌మున్‌ దమేచాలకు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ నితిన్‌ సంబ్రే తీర్పునిచ్చారు. డ్రగ్స్‌ కేసులో అక్టోబర్‌ మూడో తారీఖున ఎన్సీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతనితో పాటు మరికొందరు జైల్లోనే గడిపారు.