Jan 23,2022 07:43

ముంబయి : ముంబయిలోని 20 అంతస్థుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారాన్ని ప్రకటించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఇటు మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ.. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
ప్రమాదంపై దర్యాప్తు : డిప్యూటీ సీఎం
అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతుందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు. మంత్రులు ఆదిత్య థాక్రే, అస్లామ్‌ షేక్‌లు ఈ విషయంపై దృష్టి సారిస్తారని చెప్పారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో ఆదిత్య థాక్రే, ముంబయి మేయర్‌ కిషోర్‌ పెడ్నేకర్‌లు పర్యటించారు.