Apr 20,2021 22:16

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్‌: మున్సిపల్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వ్యక్తిగత పిఎఫ్‌ సొమ్ము లెక్కలు ఈ నెల 25వ తేదీలోపు తేల్చాలని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జే.సుధాకర్‌, జిల్లా కార్యదర్శి ఆది నారాయణ, నగర ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఇబ్రహీంలు డిమాండ్‌ చేశారు. మంగళవారం కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్‌ డి.కె .బాలాజీకి యుటిఎఫ్‌ నగర శాఖ వినతి పత్రం అందజేసింది. అధికారులు స్పందించకపోతే ఈనెల 26న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్‌ కార్యాలయాల ఎదురుగా నిరసనలు చేపడతామని చెప్పారు. కమిషనర్‌ స్పందిస్తూ పిఎఫ్‌ వడ్డీతో సహా లెక్కించి ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. మునిసిపా లిటీ ఉపాధ్యాయులు సర్వేశ్వర రెడ్డి, రవి, రమేష్‌ నాయుడు, నరసయ్య, కృష్ణ, విజయ భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.