Aug 06,2022 17:20

ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు

ప్రజాశక్తి-నిమ్మనపల్లి : చంటి బిడ్డలకు ముర్రుపాలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయని ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ భాను లక్ష్మీదేవి అన్నారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా శనివారం అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి తల్లిపాల ప్రాముఖ్యతపై నిమ్మనపల్లిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, తల్లులకు తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన అర్ధ గంటలోపు తల్లిపాలను అందించాలని తెలిపారు. బిడ్డకు ముర్రుపాలను అందించడం ద్వారా వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తద్వారా చంటి పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుండి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శి లలిత, అంగన్వాడీ కార్యకర్తలు ముంతాజ్‌, కవిత, పర్వీన్‌, సంతోషమ్మ పాల్గొన్నారు.