Jun 22,2021 20:12

ప్రజాశక్తి - కాళ్ల
పెదఅమిరం గ్రామంలో 14వ ఆర్థిక సంఘం నిధులతో మురుగు బోదె ప్రక్షాళన పనులు చేపడుతున్నామని గ్రామ సర్పంచి డొక్కు సోమేశ్వరరావు మంగళవారం తెలిపారు. రెండు కిలోమీటర్ల పొడవున మురుగు బోదె పూడికతీత పనులు మూడు లక్షల రూపాయలతో చేపడుతున్నామన్నారు. ఇళ్లల్లోని వాడుక నీరు లాగపోవడంతో 15 ఏళ్ల తర్వాత ఈ ప్రక్షాళన పనులు జరుగుతున్నాయన్నారు. వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి జవ్వాది కిషోర్‌, గ్రామ కార్యదర్శి పి.కనకారావు, ప్రసాద్‌ పాల్గొన్నారు.