
ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్: ఇంకొల్లు మండల ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోటరీ గంగ భవనంలో సమావేశం జరిగింది. సమావేశంలో ఇంకొల్లు మండల అధ్యక్షులుగా షేక్ రషీద్ (గంగవరం), కార్యదర్శిగా షేక్ సుభాని (ఇంకొల్లు), కోశాధికారిగా హుసేన్‌వలి (కొణికి)ని నియమించారు. సభ్యులుగా పి సుభాని, రషీద్, పి నజీర్, హనీఫ్, షబ్బీర్, సుభానిలను నియమించారు. త్వరలో ముస్లిముల ఆత్మీయ సమావేశం జరుపుతామని, సమస్యలపై కృషి చేస్తామని బాపట్ల జిల్లా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ రషీద్ (దిలీప్) తెలిపారు. కార్యక్రమంలో నవభూమి పత్రిక చైర్మన్ కరీముల్లా, బాపట్ల జిల్లా సీనియర్ న్యాయవాది షేక్ జమృద్‌బాషా, డాక్టర్ ఉమ్రాన్, షేక్ ఇబ్రహీం, దగ్గుబాడు మాజీ సర్పంచ్ ముల్లా నూర్ అహ్మద్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.