
ప్రజాశక్తి-మొగల్తూరు : మే పుష్పం వికసించింది. మండలంలోని పేరుపాలెం సౌత్ కి చెందిన కారుమంచి రాజయ్య ఇంటి ఆవరణలో గతంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి తీసుకొచ్చిన మొక్క నాటారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మే నెలలోనే పుష్పం వికసిస్తుంది. శుక్రవారం ఈ పుష్పాన్ని చూసేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు.