Oct 02,2022 16:29

ప్రజాశక్తి-పుట్లూరు: మండలంలోని అరకటవేముల గ్రామంలో ఎన్నారై రవినాయుడు కుమార్తె హితేష్ణ పుట్టినరోజు సందర్భంగా తానా ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఎన్నారై, తానా సభ్యుడు పొత్తూరి రవినాయుడు ఆధ్వర్యంలో సక్షమ్ , పుష్పగిరి ఆసుపత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సక్షమ్ సుంకు వేణుగోపాల్ మాట్లాడుతూ అమెరికాలోని తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా సహకారంతో కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేయించడం సంతోషదగ్గ విషయమన్నారు. రవి నాయుడు అరకటవేములలో పుట్టడం ఆ గ్రామ ప్రజలు చేసుకున్న పుణ్యమన్నారు. గ్రామంలో అనేక సంక్షేమ, సేవా కార్యక్రమాలు చేశారన్నారు. ఉపాధ్యాయుడు బండారు శంకర్ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న రవినాయుడు తన ఊరిపై మమకారం పెంచుకొని విద్య, వైద్యం అందించాలనే తపన ఎనలేనిదన్నారు. పాఠశాలకు కంప్యూటర్ల, ప్లేటు, గ్లాసులు, ఇచ్చరన్నారు.  ఆయన ఇలాంటి సేవ కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. 211 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. శస్త్ర చికిత్సల కోసం 110    మందిని ఎంపిక చేశారు. 60 మందికి అద్దాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.  వైద్యం కోసం వచ్చిన వృద్ధులకు, అందరికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎన్నారై తల్లిదండ్రులు పొత్తూరి నారాయణ, లక్ష్మీదేవమ్మను శాలువాతో సత్కరించారు.  కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ బాలరంగయ్య, సోమశేఖర్ నాయుడు, నల్లగొండ రాయుడు, ఓబులేసు, సక్షమ్  జిల్లా కార్యదర్శి మల్లికార్జున, వైద్యులు భానుకిరణ్, లక్ష్మీ, భాగ్య లక్ష్మీ, సీన నాయక్, ప్రాణేష్, విశ్వనాథ రెడ్డి, ఎన్ సీసీ విద్యార్థులు, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.