Aug 19,2022 14:49
  • పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ రత్నకుమార్ ...

ప్రజాశక్తి-నార్పల : గొర్రెలు మేకలలో నట్టల నివారణ మందులు ప్రతి మూడు నెలలకు ఒకసారి కాపాడడం వల్ల గొర్రెలు మేకల కడుపులో తొలి పురుగులు చనిపోతాయని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ రత్నకుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చామలూరు గ్రామం నందు గొర్రెలు మేకలకు నట్టల మందు ద్రావణం త్రాగించడం జరిగింది. ఈ నట్టల నివారణ మందుల పంపిణీ మండలం నందు 30వ తారీఖు వరకు ప్రతి గ్రామమునకు అందజేయబడును. అని మండల వెటర్నరీ వైద్యులు గోవిందరాజులు తెలిపారు. కార్యక్రమమునకు పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ రత్నకుమార్   ఉపసంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి  పర్యవేక్షణ చేశారు. సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ నులి పురుగులు బయటికి పంపబడి బాగా మేత మేసేదానికి మరియు ఆరోగ్యంగా బరువు పెరగడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే గొర్రెలు మేకల పెంపకదార్లు వారి మందలోని మగ పొట్టేళ్లను తప్పకుండా మార్చుకోవాలని ,ఒకే మందలోని పొట్టేళ్లను వాడడం వలన బలహీనమైన గొర్రెలు పుడతాయని ,ప్రతి 20 నుండి 25 గొర్రెలకు ఒక పొట్టేలు కచ్చితంగా మందలో ఉండాలని సూచించారు. కార్యక్రమం నందు నార్పల పశువైద్యాధికారి డాక్టర్ గోవిందరాజు సిబ్బంది భాను ప్రకాష్ గోపాల మిత్రులు గురు ప్రసాద్ శివప్రసాదులు పాల్గొన్నారు.