
హీరో గోపీచంద్, హీరోయిన్ రాశీ ఖన్నా జంటగా నటించిన లేటెస్ట్ సినిమా 'పక్కా కమర్షియల్'. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని మాస్ అండ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు. హీరోహీరోయిన్లు ఇద్దరూ ఈ మూవీలో లాయర్లుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే 'పక్కా కమర్షియల్' చిత్ర ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. కాగా, ఈ చిత్రాన్ని జూలై 1న విడుదల చేయబోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ నెల 26న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్టుగా తెలియజేస్తూ దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.