
నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, కౌశిక్ ఘంటశాల, రియా సుమన్, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'మెన్ టూ'. శ్రీకాంత్ జి. రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ మే 26న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నటీనటులు బ్రహ్మాజీ, నరేష్ అగస్త్య మాట్లాడారు. వినోదాత్మకమైన ఈ చిత్రాన్ని చూసి అందరూ నవ్వుకుంటారన్నారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీస్‌కు, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.