Jun 30,2022 11:36

విజయ్ దేవర కొండ హీరోగా పూరీ జగనాథ్‌ దర్శకత్వం వహిస్తున్న పాన్‌ ఇండియా మువీ లైగర్‌. బాలీవుడ్‌ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్‌ టైసన్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. గురువారం మైక్‌ టైసన్‌ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆయనకు ప్రత్యేక విషెస్‌ తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. షూటింగ్‌ పాల్గొన్న ఫోటోలతో ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియోలో డైరెక్టర్‌ పూరితో పాటు విజయ్ దేవరకొండ, ఛార్మి, బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహర్‌, అనన్యపాండే తదితరులు విషెస్‌ తెలిపారు. ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఛార్మి, కరణ్‌ జోహార్‌, అజరు మెహతాలు లైగర్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తనిష్క్‌ భగ్చీ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు. ఈ సినిమా నాన్‌ థియేట్రికల్‌ హక్కులను రూ.110 కోట్లకు మేకర్స్‌ అమ్మేశారని టాక్‌ వినిపిస్తోంది. ఇందులో ప్రముఖ నిర్మాణ సంస్థ సోని ఆడియో హక్కులను రూ.14 కోట్లకు కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి. లైగర్‌ మూవీ రిలీజ్‌ కాకుండానే విజయ్ తో జనగణమనను పూరీ రూపొందిస్తున్న సంగతి విదితమే.

b