
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 11.23 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూప్రకంపనలు వచ్చినటుల అధికారులు తెలిపారు. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. అయితే ఎలాంటి నష్టం జరుగలేదని చెప్పారు.
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఆదివారం ఉదయం ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్ సమీపంలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది. ఫైజాబాద్‌కు దక్షిణాన 72 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 220 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.