Aug 18,2022 23:32

  • కుదరదన్న ఉద్యోగులు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఉద్యోగులకు ఓపిఎస్‌ ( ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌) అమలు చేయడం సాధ్యం కాదని మంత్రుల కమిటీ తేల్చిచెప్పినట్టు సమాచారం. ఉద్యోగ సంఘాలతో గురువారం సచివాలయంలో జరిపిన చర్చల్లో సిపిఎస్‌ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జిపిఎస్‌ను అంగీకరించాలని కమిటీ పట్టుబట్టినట్టు తెలిసింది. అయితే, దీనిని ఉద్యోగసంఘాల నాయకులు వ్యతిరేకించారు. తమకుహామీ ఇచ్చిన విధంగా ఓపిఎస్‌ను అమలు చేసి తీరాలని ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. మంత్రుల కమిటీ బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి నటరాజన్‌ గుల్జార్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ చిరంజీవి చౌదరి, జిఎడి కార్యదర్శి అరుణ్‌కుమార్‌, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యోగుల సంఘాల తరుపున ఎపి ఎన్‌జిఓ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఎపిజెఎసి అమరావతి ఛైర్మన్‌ బప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వై.వి రావు, సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు క.వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రసాదు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధయక్షులు కె.ఆర్‌.సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు, యుటిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు. సమావేశ ప్రాంరభంలోనే మంత్రులు జిపిఎస్‌ను అంగీకరించాలని కోరడంత ఉద్యోగ సంఘాల నాయకులు తిరస్కరించినట్లు తెలిసింది. సిపిఎస్‌ వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుందని, జిపిఎస్‌ అంతకంటే ఎక్కువ నష్టం వస్తుందని వారు చెప్పారు. ఈ దశలో జోక్యం చేసుకును మంత్రులు ఓపిఎస్‌ అమలు చేయడం సాధ్యం కాదని, ఉద్యోగులు పట్టుబట్టడం సబబు కాదనిఅనుట్లు తెలిసింది. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజస్థాన్‌ ఇతర రాష్ట్రాల్లో ఒపిఎస్‌ అమలు చేస్తునాురని ప్రస్తావించారు. దీనికి మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందిస్తూ అక్కడ వేతనాలు ఎంత ఉన్నయో, ఇక్కడ ఎంత ఉనాుయో చూడాలని అన్నట్లు తెలిసింది. అవసరమైతే రెండు పక్షాలుగా కమిటీ వేసి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ప్రతిపాదించినట్లు సమాచారం. దీనికి ఉద్యోగ సంఘాల నాయకులు అంగీకరించలేదు. ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయిందని, మరో కమిటీ అంటే మరింత సమయం పడుతుందనివారు తిస్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం ఇదేనని, మార్పులు చేర్పులు చేయాలంటే రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పట్లో సాధ్యం కాదనితేల్చిచెప్పారు. దీనిపై చర్చించుకుని అభిప్రాయం చెబుతామను ఉద్యోగులు అనంతరం ఓపిఎస్‌ మాత్రమే తమకు సమ్మతమని, ప్రభుత్వమే మరోమారు ఆలోచించాలని కోరారు. దీనికి ప్రభుత్వ ప్రతినిధులు ససేమిరా అన్నారు.