Dec 08,2022 13:22

ప్రజాశక్తి-నందిగామ : నకిలీ మిర్చి విత్తనాలు వల్ల నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎపి రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో బాదిత రైతులు గురువారం నందిగామ పాతబస్టాండ్లో రైతు నేస్తం పాపు వద్ద ధర్నా చేశారు. కౌలు రైతు సంఘం ఎన్టిఆర్ జిల్లా అధ్యక్షులు సీతారెడ్డి , రైతు సంఘం ఎన్టిఆర్ జిల్లా అధ్యక్షులు పివి ఆంజనేయులు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చనుమోలు సైదులు మాట్లాడుతూ వి షీల్డు గోల్డు 500 నకిలీ మిర్చి విత్తనాలు అమ్మిన రైతు నేస్తం పాపు యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యకరానికి రెండు లక్షల రూపాలు వరకు రైతులు నష్ట పోయారని, పంట ఎదుగుదల లోపించిందని, పూత, పిందె రాక రైతులు తీవ్రంగా నష్టపోయారని, బాదిత రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గోపాల్, గోపి నాయిక్ తదితరులు పాల్గొన్నారు‌.