Oct 05,2022 10:15

ప్రజాశక్తి-చాపాడు : 2021-22 రబీ సీజన్ లో దువ్వూరు, మైదుకూరు మండలాలలో 750 మంది రైతులు 2500 ఎకరాల్లో టాటా ర్యాలీ, బేయర్ కంపెనీకి చెందిన క్రాసింగ్ చేసిన మొక్కజొన్న పంటను సాగు చేశారు. అధిక వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయి టాటా కంపెనీకి చెందిన మొక్కజొన్న రైతులు రూ. 3.69 కోట్ల మేర నష్టపోయారు. రైతులకు న్యాయం చేయాలని కంపెనీలపై కడప పార్లమెంట్ సభ్యులు వై.యస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి కడప జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సంబటురు ప్రసాద్ రెడ్డి ఒత్తిడి తీసుకువచ్చారు. స్పందించిన కంపెనీలు నష్టపోయిన రైతుల అందరికీ రూ.3.69 కోట్ల నష్ట పరిహారం జమ చేశారు. బుధవారం రైతులు ఎమ్మెల్యే ఎస్ రఘురామి రెడ్డిని, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు సంగుటూరు ప్రసాద్ రెడ్డిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.