
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : శుక్రవారం కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి కుటుంబ సమేతంగా కౌన్సిలర్లతో కలిసి దర్శించుకున్నారు. సకాలంలో వానలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని గోవిందుని కోరినట్లు మేడా తెలియజేశారు.