Jan 28,2023 15:43

ప్రజాశక్తి-నందిగామ : నందిగామ 17వ వార్డు కౌన్సిలర్ బాపట్ల సాంబయ్యను నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు శనివారం పరామర్శించారు. నందిగామ పట్టణంలోని 17వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యులు బాపట్ల సాంబయ్య  ఇన్ఫెక్షన్ తో అనారోగ్యానికి గురికావడం జరిగింది.  సాంబయ్య నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించి, ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.