Jun 02,2023 20:48
  • పలుఅంశాలపై సిఎంకు కెఎస్‌ లక్ష్మణరావు వినతి

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు సిఎం జగన్మోహన్‌రెడ్డిని కోరారు. ముఖ్యమంత్రి గుంటూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా స్థానిక పోలీసు పేరేడ్‌ గ్రౌండ్‌లో జగన్మోహన్‌రెడ్డిని ఆయన శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. సిపిఎస్‌ రద్దు చేసి మూడు లక్షల ఉపాధ్యాయులు, ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి కొత్త డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, 1998 డిఎస్‌సి క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. గుంటూరు ఛానల్‌ విస్తరణకు రూ.113 కోట్లు కేటాయించాలని, గురుకులాల్లో, యూనివర్సిటీలలో నాన్‌-టీచింగ్‌ స్టాఫ్‌కు పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.