Jun 23,2022 09:08

అయోధ్య :  నదిలో స్నానం చేస్తూ భార్యను ముద్దాడినందుకు భర్తపై  ఓ గుంపు మూక దాడి చేసింది.  ఈ ఘటన  ఉత్తర ప్రదేశ్ లోని  అయోధ్యలోని సరయు నదికి చెందిన ఓ ఘాట్ లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో  చక్కర్లు కొడుతోంది. అయోధ్యలో ప్రవహించే సరయు నదిలో ఓ జంట స్నానం చేయడానికి దిగింది.  ఈ క్రమంలో భర్త తన భార్యకు ముద్దుపెట్టాడు.  వెంటనే ఆ పక్కన స్నానం   చేస్తున్న ఓ వ్యక్తి భర్తను పక్కకు లాగి తిడుతూ.. కొట్టడం ప్రారంభించాడు. మరికొంత మంది కూడా అతడిపై దాడి చేశారు. అయోధ్యలో ఇలాంటి పనులు చేయడాన్ని సహించమంటూ గుంపు వ్యాఖ్యానించింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.