Sep 27,2022 17:01

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఇప్పటివరకు మనం మొబైల్‌ కోర్టు, లైబ్రరరీ, హెల్త్‌ క్లీనిక్‌లు వంటివి చూసి ఉంటాం. అయితే కదిలే కల్యాణమండపాన్ని చూశారా ఎప్పుడైనా? ఎక్కడైనా?.. అదేంటి మొబైల్‌ మ్యారేజ్‌ హాల్‌నా అని ఆశ్చర్యపోకండి. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన సృజనాత్మకతతో కంటైనర్‌ వాహనంలో ఏకంగా ఫంక్షన్‌ హాల్‌ని తీర్చిదిద్దాడు. కంటైనర్‌లో..పెళ్ళిళ్లు, ఫంక్షన్లు జరుపుకునేలా ఆ హాల్‌ని రూపొందించాడు. 40 x 30 చదరపు అడుగుల్లో ఉన్న ఈ హాల్‌లో.. భోజన సదుపాయం, కుర్చీలు, రెండు ఏసీలు, ఫర్నీచర్‌, ఇంటీరియర్‌ డిజైన్స్‌తో కళ్లు చెదిరే ఆకర్షణీయంగా ఉంది. ఈ మ్యారేజ్‌ హాల్‌ దాదాపు 200 మందికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మొబైల్‌ మ్యారేజ్‌ హాల్‌ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద ట్వీట్‌ చేశారు. త్వరలో ఈ హాల్‌ రూపకర్త ఏ రాష్ట్రానికి చెందినవాడు అనేది మహీంద్రా వివరాలు వెల్లడించలేదు. అయితే తను త్వరలోనే ఈ హాల్‌ రూపకర్త  కలవనున్నట్టు  ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతుంది.

 

12

 

hall 4