May 31,2023 09:12

ఒక అడవిలో పిచ్చుక తన పిల్లతో ఒక చెట్టు మీద నివసిస్తుంది. ఆహారం కోసం వెళ్తూ పిచ్చుక తన పిల్లతో 'బిడ్డా... బయటకు వెళ్ళొద్దు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లోనే ఉండు' అని చెప్పి ఆహారం కోసం బయలుదేరింది. వాళ్ళమ్మ మాట వినకుండా పిచ్చుక పిల్ల తన గూడును వదిలి మిత్రులతో బయటకు వెళ్ళింది. తల్లి వచ్చి చూస్తే పిచ్చుక పిల్ల కనిపించలేదు. ఈ ఎండకు నా బిడ్డ ఎక్కడకు వెళ్ళిందో అని కంగారు పడుతూ అంతా వెదికింది. కాని పిచ్చుకపిల్ల కనిపించలేదు. పిచ్చుక పిల్ల తన మిత్రులతో పగలంతా తిరిగి తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరింది. పగలంతా ఎండకు తిరగటం వల్ల వడదెబ్బ తగిలి ముడుచుకు పోయింది.
       అప్పుడు తల్లి తన బిడ్డకు సపర్యలు చేస్తూ ఇలా అంది : 'నేను చెప్పాను కదా! బయటకు వెళ్ళొద్దని. అయినా ఎందుకు వెళ్ళావమ్మా? ఇప్పుడు చూడు ఎంత బాధపడుతున్నావో' అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. 'క్షమించమ్మా! ఇంకెప్పుడూ నీమాటను పెడచెవిన పెట్టను' అని తన తల్లి ఒడిలో తల వాల్చింది పిచ్చుక పిల్ల.

- కె. హిమసాయి
9వ తరగతి,
ఎం.తిమ్మాపురం ఆదర్శ పాఠశాల,
మహానంది (మం), నంద్యాల జిల్లా.