May 29,2023 16:35

ప్రజాశక్తి-మండపేట : స్థానిక గౌతమి మున్సిపల్ హైస్కూల్లోని జగనన్న విద్యా కానుక స్టాక్ పాయింట్ ను మండల అభివృద్ధి అధికారి ఐదం రాజు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు ప్రణాళిక బద్ధంగా జగనన్న విద్యా కానుక అందించాలన్న లక్ష్యంతో మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఎయిడెడ్ స్కూల్ తో కలిపి 69 పాఠశాలలలోని విద్యార్థులకు (3409 బాలురు, 3596 బాలికలు) 7005 జగనన్న విద్యా కానుక అందించనున్నామన్నారు. ఇందులో భాగంగా 4563 బెల్టులు, యూనిఫామ్ తో పాటు ఒకటో తరగతి విద్యార్థులకు బొమ్మలతో కూడిన డిక్షనరీ, ఆరవ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 6 నుంచి 10 తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు ప్రభుత్వం అందించనుందన్నారు. ప్రస్తుతం 45 వేల పాఠ్యపుస్తకాలు, షూస్ స్టాక్ పాయింట్ కి వచ్చాయన్నారు. మరొక 15 వేల పుస్తకాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు.