May 25,2023 20:51

నటుడు విజయ్ సేతుపతి నటించిన హిందీ డెబ్ల్యూ మూవీ 'ముంబైకర్‌'. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. జూన్‌ 2న విడుదల అవుతుందని మేకర్స్‌ ప్రకటించారు. డైరెక్టుగా ఓటీటీ ప్లాట్‌ఫాం జియో స్టూడియోస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీజర్‌ను కూడా షేర్‌ చేసింది. ఇందులో విజరు సేతుపతి ఓ చిన్నారిని కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించారు. తర్వాత ఎలాంటి పరిణామా లను ఎదుర్కొన్నాడనేది మిగిలిన కథ. ముంబైకర్‌ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుంది. సంతోష్‌ శివన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో విక్రాంత్‌ మెస్సీ, తాన్య మణిక్తల, రాఘవ్‌ బినాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ కథనందించడం విశేషం.