Oct 02,2022 15:11

ప్రజాశక్తి-పిచ్చాటూరు : గాంధీ విగ్రహానికి పారిశుద్ధ కార్మికుల వేతనాలు పెంచాలని కార్మికులు వినతి పత్రం అందించారు. పిచ్చాటూరు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు జీతాలు పెంచాలని తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని ఆదివారం రోజు అనగా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ విగ్రహానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు జానికిరాము ప్రసాద్  లలితమ్మ   మునస్వామి   విజయం పాల్గొనడం జరిగింది. కార్మికులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నామని కరోనా కష్ట కాలంలో అయితే ప్రాణాలు తెగించి గ్రామపంచాయతీలో ప్రజల కోసము పారిశుద్ధ పనులు చేసి ఒక్కరోజు కూడా నిలిచిపోకుండా గ్రామాల్లో పారిశుధ్య పనులు చేసి తమ వంతుగా పారిశుద్ధ్య పనులు చేపట్టామని తెలిపారు. ఎందరో ప్రాణాలు విడిచిపోయిన కాలములో కూడా ప్రాణాలకు తెగించి ప్రజలు ప్రాణాలను ముప్పు వాటిల్లుతున్న మురికి కాలువలు శుభ్రం చేయుట, పరిసరాలు ప్రాంతాలను పరిశుభ్రం చేసి గ్రామ పంచాయతీలో సర్పంచ్ మన్నన పొందామని ఆవేదన వెళ్లిపుచ్చుకున్నారు.