
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు మలయాళ ఇండిస్టీలో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం తెలుగులో దాదాపు ఏడు సినిమాల వరకూ నిర్మిస్తున్నారు. మాలీవుడ్ యంగ్ హీరో టోవినో థామస్ నటిస్తూ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్న చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. డాక్టర్ బిజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 'అదృశ్య జాలకంగల్' పేరుతో రాబోతోంది. ఈ చిత్రానికి రాధిక లవు నిర్మాత. అలాగే రెండు సార్లు గ్రామీ అవార్డును అందుకున్న రిక్కీ కెజ్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు.