Jul 28,2021 18:35

`నా సినీ జీవితాన్ని మ‌లుపు తిప్పిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో పోలీస్ స్టోరీ, ప్ర‌స్థానం చిత్రాలు నాకు ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ఇచ్చాయి. నా యాభై ఏళ్ల సినీ జీవితంలో ఇప్ప‌టి వ‌రకు పోషించిన పాత్ర‌లు నా ఫ‌స్ట్ ఇన్నింగ్స్ కి వైభ‌వాన్ని తీసుకువ‌చ్చాయి. ఇక‌ నా సెకండ్ ఇన్నింగ్స్ కి అద్భుత‌మైన గుర్తింపును తీసుకొచ్చే సినిమాగా SR క‌ళ్యాణమండంపం EST 1975 అవ్వ‌డం ఖాయం. హీరో కిర‌ణ్ అబ్బ‌వరం చాలా ఫోక‌స్ డ్ గా ప‌నిచేస్తూ ఉంటాడు, ఈ సినిమాతో కిరణ్ మంచి పేరు, గుర్తింపు రావాల‌ని,  ఈ చిత్రాన్ని థియేట‌ర్స్ లో చూసి ప్రోత్స‌హించాల‌ని కోరుకుంటున్నా... అని సాయికుమార్ అన్నారు.

`రాజావారు రాణిగారు` ఫేమ్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా న‌టించిన సినిమా ఇది. ప్ర‌మోద్,- రాజు నిర్మాత‌లు. శ్రీధ‌ర్ గాదే ద‌ర్శ‌కుడు. ఇటీవ‌లే విడుద‌ల చేసిన టీజ‌ర్ కి సైతం అంతటా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఆగ‌స్ట్ 6న‌ థియేట‌ర్ లో విడుద‌ల చేస్తున్నారు. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూర్చారు. కాగా, బుధ‌వారం మాదాపూర్ లో ఎ.ఎం.బి.మాల్‌లో ట్రైల‌ర్‌ విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా సాయికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని పైవిధంగా స్పందించారు.

అనంత‌రం హీరో కిర‌ణ్ మాట్లాడుతూ,  ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ ఈ సినిమా ఆద్యంతం అల‌రించే రీతిన తీర్చిదిద్దారని అన్నారు. చిత్ర నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ, మంచి సినిమాను థియేట‌ర్ల‌లోనే చూడండ‌ని పేర్కొన్నారు.