Aug 18,2022 23:20

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే


ప్రజాశక్తి-పాయకరావుపేట: మండలంలోని సీతారాం పురం, గుంటపల్లి గ్రామాల్లోని నాడు నేడు పనుల్లో భాగంగా గురువారం ఎమ్మెల్యే బాబురావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందన్నారు. నాడు నేడు పనులు, సంక్షేమానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కి దక్కుతుందన్నారు. మండలంలోని గుంటపల్లి గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కాంపౌండ్‌ లోపల గ్రావెల్‌ వేసి సమానం చేయడానికి వెంటనే రూ.20 లక్షలు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ చిక్కాల రామారావు, మండల పార్టీ అధ్యక్షులు దనిశెట్టి బాబురావు, సర్పంచ్‌ గెడ్డం సుజాత కన్నబాబు, జడ్పిటిసి లంక సూర్యనారాయణ, గెడ్డం బుజ్జి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గుటూరు శ్రీను, వైసిపి నాయకులు గారా ప్రసాదు, జగత శ్రీను, ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఎంఈఓ కే.గాంధీ, ఎంపీటీసీ లచ్చబాబు పాల్గొన్నారు.