Nov 21,2020 20:32

 హైదరాబాద్ : నటుడు నాగశౌర్య సొంత సంస్థ ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై కొత్త సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో తీస్తున్న చిత్రంలో గాయని శిర్లే సెటియా నటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. న్యూజిలాండ్‌, ఆక్లాండ్‌లో పాప్‌ సింగర్లలో శిర్లే సెటియా ఒకరు. ఇంకా సినిమా టైటిల్‌ని ఫిక్స్‌ చేయలేదు. ఇంకా నటీనటుల ఎంపిక సాగుతోంది. ఈ చిత్రాన్ని నాగశౌర్య తల్లిదండ్రులు ఉషా, శంకర్‌ ములుపూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు.