Nov 30,2022 22:50

భోజనాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి - పిఠాపురం
మధ్యాహ్నం భోజన పథకం లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజే యాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు సిద్దు, శ్రీకాంత్‌ లుడిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని మల్లం, విరవ, విరవాడ గ్రామాల్లోని హైస్కూల్లో విద్యార్థులకు అందజేస్తున్న భోజనాన్ని పరిశీలించారు. మండలంలో ఉన్న సుమారు 20కి పైగా ఉన్నత పాఠశాలల్లో సుమారు పదివేల మంది విద్యార్థులు చదువుతున్నారని వీరికి ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకం పేరుతో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి తప్ప అందజేసే మధ్యాహ్నం భోజనంలో నాణ్యత లేదన్నారు. సరైన రుచి, నాణ్యత లేకపోవడంతో సగం మందిపైగా విద్యార్థులు పాఠశాలలో భోజనం చేయలేక అనేకమంది విద్యార్థులు భోజనం చేయకుండా అర్ధ ఆకలితో పాఠశాలలో ఉంటున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు లోవరాజు, అయ్యప్ప, మణికంఠ, వెంకటేష్‌, బాజి, చిన్ని, ప్రసన్న ఉన్నారు.