Sep 15,2021 23:42

రైతులతో మాటాలడుతున్న ఎఒ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఆళ్లగడ్డ: రైతు సోదరులు నాణ్యమైన దిగుబడి, నికర ఆదాయం పెంపొందించుకునే విధంగా దృష్టి సారించాలని ఎఒ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బాచేపల్లి తాండ గ్రామంలో పొలంబడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట పండించే విషయంలో అనవసర పెట్టుబడి తగ్గించే మెలకువలు తెలుసుకోవాలన్నారు. అవసరమైన మందును తగిన మోతాదులో పిచికారి చేయాలన్నారు. వరి పంటలో కాంప్లెక్స్‌ ఎరువులు తగ్గించాలన్నారు. అనంతరం ఆకుల కత్తిరింపు ప్రయోగంను చూపించి కారణాలను వివరించారు. ఏఈఓ హుస్సేన్‌, విఏఏ సాల్మాన్‌, రైతులు పాల్గొన్నారు. రుద్రవరం : సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని ఎఒ ప్రసాదరావు తెలిపారు. శ్రీరంగాపురం గ్రామంలో మొక్కజొన్న పంటలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాస్‌, గ్రామ సహాయకుడు శ్రీకాంత్‌, రైతులు పాల్గొన్నారు.