
సిడ్నీ : టీమిండియా బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ గార్డ్ మార్క్‌ను వక్రబుద్ధితో చెరిపేశానని తనపై వచ్చిన ఆరోపణలను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ ఖండించారు. ఈ నిందలు విని షాక్‌కు గురయ్యానని, నిజంగా ఇది సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిడ్నీ టెస్ట్ డ్రింక్స్ బ్రేక్‌లో స్మిత్ కావాలనే పంత్ గార్డ్ మార్క్‌ను చెరిపేశాడని, స్మిత్ ఓ మోసగాడని భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. మాజీ క్రికెటర్లు సైతం స్మిత్‌ను తప్పుబట్టారు. అయితే ఈ వివాదంపై తాజాగా స్మిత్ స్పందించాడు. తనపై ఇలాంటి నిందలు రావడం ఎంతో బాధగా ఉందన్నాడు. 'నాపై నిందలు రావడం ఆశ్చర్యంగా, బాధగా ఉంది. మా బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారు, వాటిని ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఎలా ఎదుర్కొంటున్నారని ఊహిస్తూ క్రీజులో గార్డు మార్క్‌ను చేసుకుని ఆలోచించడం నాకు అలవాటు. కానీ టీమిండియా ఆఖరి రోజు చేసిన అద్భుత పోరాటాన్ని మరిచి ఈ విషయాన్ని ఎత్తిచూపించడం మాత్రం సిగ్గుచేటుగా అనిపిస్తోంది'' అని స్మిత్ అసహనం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ కూడా స్మిత్‌కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్‌లో స్మిత్ క్రీజు వద్దకు వెళ్లి అతడే బ్యాటింగ్ చేస్తున్నట్లు గార్డ్ మార్క్‌ను మార్చుకుంటాడని తెలిపాడు. మీరు స్టీవ్ స్మిత్‌ను టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు చూస్తే.. ఇలా క్రీజు వద్దకు వెళ్లి తాను బ్యాటింగ్ చేస్తున్నట్లు రోజుకు ఐదు లేదా ఆరుసార్లు ఊహించుకుంటాడని తెలపాడు.