Mar 27,2023 23:02

డయల్‌ యువర్‌ ఇఒలో సమస్యలు వింటున్న చంద్రశేఖర్‌ ఆజాద్‌

డయల్‌ యువర్‌ ఇఒకు పలువురి వినతి
ప్రజాశక్తి - అన్నవరం
అన్నవరం దేవస్థానం కొండపైకి మెట్ల మార్గం ద్వారా వెళ్లే యాత్రికులకు ప్రత్యేక దర్శనం కల్పించాలని సోమవారం కొండపైన డయల్‌ యువర్‌ ఇఒ నిర్వహించిన కార్యక్రమంలో అన్నవరానికి చెందిన డి మురళి సూచించారు. బైపాస్‌లో ఉన్న సత్యదేవుని నమూనా ఆలయం వద్ద మెయిన్‌ రోడ్‌లో తొలి పావంచా వద్ద ఉన్న బాత్‌ రూములు అపరిశుభ్రంగా ఉన్నాయని దుర్గంధం వస్తోందని విశాఖపట్నం చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు వన దుర్గ ఆలయంలో సేవా టిక్కెట్లు తీసుకున్న భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రసాదం అందడం లేదని తునికి చెందిన ఒకరు ఫిర్యాదు చేశారు. బైపాస్‌ నమోనా ఆలయం వద్ద పండ్ల దుకాణం వేలం నిర్వ హించాలని, దేవస్థానం అనంత లక్ష్మి సత్రం వద్ద కబ్జా స్థలాన్ని ఖాళీ చేయించి దేవస్థానం షాప్‌ లు కట్టిస్టే ఆదాయం వస్తుందని, రహదారి విస్తరణ పెరుగుతుందని స్థానికుడు ఈర్లు శ్రీనివాస్‌ సూచించారు. ఈ సందర్భంగా ఈవో ఆజాద్‌ మాట్లాడుతూ భక్తులు అందించిన పలు ఫిర్యాదులు సలహాలు సూచనలు, సాధ్యమైనంత తొందరలో పరిష్కరిస్తామని తెలిపారు.