Jun 02,2023 21:52

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం, ప్రజా సమస్యలపై బలమైన పోరాటం చేసేందుకు'వారాహి' యాత్రను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 14న ప్రారంభిస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత అనువరం సత్యదేవుని దర్శనం అనంతరం వారాహి యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. అనువరం నుంచి భీమవరం వరకు11 నియోజకవర్గాల్లో తొలుత యాత్ర సాగుతుందనాురు. ప్రతి నియోజకవర్గంలో పవన్‌కల్యాణ్‌ రెండు రోజులపాటు ఉండేలా, సభలో ప్రసంగించేలా ప్రణాళిక తయారు చేశామన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గంతో మొదలు పెట్టి పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్‌, ముమ్మిడివరం, అమలాపురం, పి గనువరం, రాజోలులో పర్యటన ఉంటుందనాురు. అనంతరం నరసాపురం, పాలకొల్లు, భీమవరం, నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుందని, ఇతర నియోజకవర్గాల్లో రూట్‌మ్యాప్‌ను స్థానిక నేతలతో చర్చించి ఖరారు చేస్తామన్నారు. ప్రతిరోజూ ఉదయం తొమ్మిది గంటలకు ప్రజా వినతులు స్వీకరించి, స్థానికులు, రైతులు, మహిళలు, వివిధ వర్గాలతో పవన్‌కల్యాణ్‌ ప్రత్యేకంగా మాట్లాడతారని తెలిపారు.