Mar 25,2023 00:21

మట్లాడుతున్న రిటర్నింగ్‌ అదికారి

ప్రజాశక్తి- నక్కపల్లి:ఆధార్‌ అనుసంధానం పై శనివారం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని పాయకరావుపేట నియోజకవర్గం ఎన్నికలు రిటర్నింగ్‌ అధికారి రామలక్ష్మి బూత్‌ లెవెల్‌ అధికారులకు సూచించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం బూత్‌ లెవెల్‌ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆధార్‌ అనుసంధానంకు సంబంధించి వెనకబడి ఉన్నందున ఆధార్‌ అనుసంధానం శతశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్య వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి తహసిల్దార్‌ నీరజ, తదితరులు పాల్గొన్నారు .