
-19న సభను జయప్రదం చేయండి
- టిడిపి నంద్యాల అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి
ప్రజాశక్తి- కర్నూలు హాస్పిటల్: కర్నూలు జిల్లాకు ఈ నెల 18, 19న టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రానున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని టిడిపి నంద్యాల అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి నాయకులను, కార్యకర్తలను కోరారు. మంగళవారం వెంకటరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మాధవి నగర్ స్వగృహంలో ఓర్వకల్లు, కల్లూరు రూరల్, అర్బన్ వార్డు నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈనెల 18న రాత్రి కర్నూలు నగరానికి వస్తున్నారని రాత్రి బస మౌర్యఇన్ హోటల్‌లో ఉంటుందని వివరించారు. 19నఉదయం 11 గంటలకు నగర శివారులోని కమ్మ సంఘం సత్రం హాలులో నాయకులు కార్యకర్తల మీటింగ్ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశానికి భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి రావాలని కోరారు. సమావేశం అనంతరం డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో జరిగే బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారని వారు తెలిపారు. కార్యక్రమంలో తెలుగు మహిళా సంఘం అధ్యక్షురాలు పార్వతమ్మ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, కల్లూరు ఓర్వకల్ మండలాల అధ్యక్షులు డి. రామాంజనేయులు, గోవిందరెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వెంకట స్వామి టిడిపి రాష్ట్ర పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసి సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.