
న్యూఢిల్లీ : కేరళ, తమిళనాడులో ఆదివారం లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. కేరళలో 23వ తేదీతోపాటు వచ్చే ఆదివారం 30వ తేదీని కూడా లాక్డౌన్ అమలవుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పెళ్లికి 20 మందినే అనుమతిస్తామని, హోటళ్ల నుంచి పార్సిల్ సర్వీసులనే అనుమతిస్తామని తెలిపింది. అత్యవసర ప్రయాణాలను అనుమతించింది. తమిళనాడులో ఎయిర్పోర్టు, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లకు వెళ్లేందుకు ఆటోలు, టాక్సీలను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. కర్ణాటక వీకెండ్ కర్ఫ్యూను ఎత్తివేసింది.