Oct 03,2022 19:19

 గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన జెండా

ప్రజాశక్తి-ఆదోని
మండలంలోని సంతేకుడ్లూరు గ్రామంలో కెవిపిఎస్‌ ఆవిర్భావ దినోత్సనం సందర్భంగా మంగళవారం నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపడుతున్నట్లు కెవిపిఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి తిక్కప్ప తెలిపారు. ముఖ్యఅతిథిగా కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు దేవసహాయం పాల్గొంటున్నారని చెప్పారు. సోమవారం ఆయన మాట్లాడారు. గ్రామంలో వివక్షతకు వ్యతిరేకంగా ఈనెల 17న చేపట్టిన ప్రతిఘటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.ఆనంద్‌ బాబు పాల్గొంటున్నారని తెలిపారు. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా అగ్రవర్ణాల పెత్తనానికి వ్యతిరేకంగా యువకులు నూతన జెండాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కుల వివక్షను అంతం చేసేందుకు గ్రామ యువకులు పూనుకున్నారని తెలిపారు.