May 18,2022 09:51

-థామస్‌ కప్‌ విజేత జట్టు క్రీడాకారుడికి గాయం
-థాయ్ ఓపెన్‌ నుంచి నిష్క్రమణ

బ్యాంకాక్‌ : నేటి నుంచి మొదలయ్యే థాయ్ లాండ్‌ ఓపెన్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీ ప్రారంభం కానుంది. థామస్‌ కప్‌ టైటిల్‌ భారత్‌కు దక్కడంలో కీలకపాత్ర పోషించిన డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి వైదొలింగింది. చిరాగ్‌ శెట్టి గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌ విభాగంలో థామస్‌ కప్‌ 'హీరో'లు కిడాంబి శ్రీకాంత్‌, ప్రణరు బరిలో ఉన్నారు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత సాయిప్రణీత్‌, సౌరభ్‌ వర్మ కూడా పోటీపడుతున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.