May 05,2021 08:49
  • మృతుల్లో సర్పంచ్‌, కూలీలు

ప్రజాశక్తి- నెల్లూరు : నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టరు బోల్తాపడడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. వారిలో సర్పంచ్‌, నలుగురు మహిళా కూలీలు ఉన్నారు. ఈ సంఘటన గొల్లకందుకూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గొల్లకందుకూరు నుంచి పుచ్చకాయల లోడుతో సమీపంలోని సజ్జాపురం గ్రామంలోగల తోటలోకి ట్రాక్టర్‌ బయలుదేరింది. ఈ ట్రాక్టర్‌ను గొల్లకందుకూరు సర్పంచ్‌ అప్పకూటి పెంచలయ్య (60) నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన కూలీలు కిలారి హైమావతి (43), లాలీ లకీëకాంతమ్మ (45), మనపాక కష్ణవేణి (26), తాండ్ర వెంకటరమణమ్మ (19) ఆ ట్రాక్టర్‌ను ఎక్కారు. గ్రామ సమీపంలోని చేపల చెరువు గట్టుపైనుంచి వెళ్తుండగా అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో పడింది. దీంతో, వారు ఐదుగురూ అక్కడికక్కడే మరణించారు. సంఘటనా స్థలాన్ని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పోలీసులు పరిశీలించారు. మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.