Jul 29,2021 19:49

హీరోయిన్‌ నయనతార ప్రధాన పాత్రలో అంధురాలుగా నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం 'నెత్రికన్‌'. ఈ చిత్రంలో అజ్మల్‌ సైకో విలన్‌ పాత్ర పోషించాడు. గురువారం ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను సోషల్‌ మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. 12 మంది అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి, చిత్రహింసలు పెట్టి, వారి చావును కళ్లారా చూసి ఆనందిస్తూ, పోలీసులకు చిక్కకుండా తిరిగే సైకో కథకు ఒక అంధురాలు ఎలా ఫుల్‌స్టాప్‌ పెట్టింది.. అనే ఉత్కంఠభరితమైన కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం ఆగస్టు 13న డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.