Mar 27,2023 21:36

స్టాండింగ్‌ కమిటీ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న మేయర్‌ విజయలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరాభివృద్ధే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారని మేయర్‌ విజయలక్ష్మి అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన మేయర్‌ విజయలక్ష్మి అజెండాలోని అంశాల వారీగా సభ్యులు అభిప్రాయాలను స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నగరంలో చేపట్టబోయే అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు చెప్పారు. కమిషనర్‌ ఆర్‌. శ్రీ రాములునాయుడు మాట్లాడుతూ సభ్యుల సూచనలు, సలహాలు మేరకు నగర అభివృద్ధికి మరింత కృషి చేస్తామని అన్నారు. సమావేశంలో సహాయ కమిషనర్‌ ప్రసాదరావు, స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు పట్నాన పైడ్రాజు, బి.ధనలక్ష్మి, పిన్నింటి కళావతి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.