Jul 26,2021 06:20

ఇప్పుడు స్వేచ్ఛగా నడిచే రోజులు లేవు
కాళ్ళకు పగ్గాలేసి పరిగెత్తించే కాలం కదా
అలవాటు పడ్డపనినే బలవంతంగా
మళ్ళీ మళ్ళీ ముద్దాడుతుంటావ్‌
అది మనిషిగా నీ గొప్పతనం
మూడు కాలలు నీ ముందునుంచి పోతున్నా
ఏ వాసనను నువ్వు పసిగట్టవు
ఎండని ఓ భగప్రేమికుడి గుండె మంట అంటావ్‌
వానని ఓ మురికివాడ అంటావ్‌
చలిని చాచి కొట్టి ఏ దుప్పట్లో దూరుతానంటావ్‌
ఎందుకుంటే ఓ నగరం బోనులో నడుస్తుంటావ్‌ కదా
ప్రకృతి పసిపాప నీ చేతిని పట్టుకొని రమ్మని
మనసుకు చెబుతుంది!
అంతా వెతికి
ఓ అంతస్తు భవనపు ఆఖరి మెట్ల మీద అద్దపు కిటికీ దగ్గర
అరచేతులతో చినుకులను తుడిచి తప్పిపోతావు
ఏ కాగితపు పడవలో ఎక్కి తీరం కోసం వెతుకుతూ...
మట్టి మనసు మీద తలపుల వర్షంలా...
చినుకులై కురుస్తావ్‌
అదే సాయంత్రం
బంతితో అద్దాన్ని పలగొట్టి పారిపోయిన పిల్లోడిలా సూర్యుడు
ఆ రాత్రంతా ఓ పచ్చి వాసన
కళ్ళ కింద నిద్రను మూటకట్టేస్తుంది
ఎన్ని రాత్రులను ఉదయాలు ఎత్తుకెళ్ళినా..
మనసు తెరల మీద
నాలుగు చినుకులై మళ్ళీ మళ్ళీ కురవాలనుకుంటావ్‌
ఇప్పుడు కాలంతో పరుగెడుతున్నా
ఆగి హత్తుకొని తడవడం ఇద్దరి లక్షణం!
 

- పి.సుష్మ
99597 0519