ప్రజాశక్తి విలేకరులు ... కొత్తచెరువు :ఎరువులు క్రిమిసంహారక మందుల దుకాణపు నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని ఎడిఎ నారాయణ, వ్యవసాయ అధికారి నటరాజు హెచ్చరించారు. ఈ మేరకు వారు మంగళవారం మండల కేంద్రంలని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈశ్వర ఆగ్రో ఏజెన్సీ, మన గ్రోమోర్ షాపులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు నిర్వహిస్తున్నందున వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రూ.1,48,500ల విలువైన సరుకుల అమ్మకాలు నిలిపివేశాన్నారు.
బుక్కపట్నం : ప్రభుత్వ నిబంధనలు ప్రకారమే ఎరువుల అమ్మకాలు జరపాలని వ్యవసాయ శాఖ ఎడి నారాయణ నాయక్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని దుకాణాలను తనిఖీ చేశారు. ఈపాస్ మిషన్ , స్టాక్ రిజిస్టర్ , స్టాక్ నిల్వలకు వ్యత్యాసాలు రావడంతో పాటు లైసెన్స్‌లో పొందుపరచని 1,14,469 రూపాయల విలువ గల ఎరువులను విక్రయించకుండా తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
దుకాణంలోని స్టాకు వివరాలు పరిశీలిస్తున్న అధికారులు