Nov 25,2021 16:13

ప్రజాశక్తి- మండపేట
నిబంధనలు గాలికి వదిలి గ్రావెల్‌ లారీలు రోడ్లపై పరుగులు తీస్తుడటంతో లారీల నుంచి క్రిందకు జారిపడుతున్న గ్రావెల్‌, వేగం కారణంగా పైకి లేస్తున్న దుమ్ము, ధూళి రేణువులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండపేట, రాజనగరం మండలాల్లోని ద్వారపూడి, కేశవరం,కొత్త తుంగపాడు, పాతతుంగపాడు, జి.యర్రంపాలెం, కొండగుంటూరులలో గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో భారీవాహనాలు మండలంలోని ద్వారపూడి -మండపేట రోడ్డు మీదుగా ప్రలు ప్రాంతాలకు గ్రావెల్‌ తరిలిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం వాహనం వెనుక నుంచి వచ్చే వాహనాదారుల మీద పడకుండా బరకం తదితర ఏర్పాట్లు చెయ్యల్సి ఉంది. అయితే అవేమీ పాటించకపోవడంతో రాకపోకల సమయాల్లో వాహనదారుల కళ్ళలోకి దుమ్ము వచ్చి చేరుతుండటంతో కళ్ళ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ విషయంపై మైనింగ్‌ శాఖ ఏడి విష్ణువర్ధన్‌ను వివరణ కోరగా పొల్యుషన్‌ నిబంధనల ప్రకారం టార్బల్‌ ఏర్పాటు చెయ్యాలని లీజుదారులందరికి ఆదేశాలు జారీ చేస్తామన్నారు.