Aug 06,2022 23:38

మాట్లాడుతున్న తహసీల్దార్‌ కోరాడ వేణుగోపాల్‌

ప్రజాశక్తి -భీమునిపట్నం : జివిఎంసి నాలుగో వార్డు పరిధి నిడిగట్టులో తహసీల్దార్‌ కోరాడ వేణుగోపాల్‌ అధ్యక్షతన శనివారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకంలో భాగంగా నిడిగట్టు గ్రామాన్ని మొత్తంగా రీ సర్వే చేసినట్లు వివరించారు. రెవెన్యూ రికార్డు ఫారం 38లో సంబంధిత రైతుల పేర్లు పొందుపరిచి, అందులో ఉన్న అభ్యంతరాలను విచారణ జరిపి సవరించామని తెలిపారు. సవరించిన రికార్డు డ్రాఫ్టు ఆర్‌ఒఆర్‌ను గ్రామ ప్రజల సందర్శనార్థం ఈ నెల 4న గ్రామ సచివాలయం వద్ద అందుబాటులో ఉంచామన్నారు. అభ్యంతరాలు ఉంటే రికార్డింగ్‌ అథారిటీ వారికి ఫారం 3ఎ ద్వారా తెలియజేయవచ్చని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.