Jul 29,2021 19:38

MANDU CHALLISTUNNA SIBBANDHI

నిడుమోలులో నిలకడగా ప్రజారోగ్యం
ప్రజాశక్తి-మొవ్వ
ఇటీవల నిడుమోలు పిహెచ్‌సి పరిధిలో డెంగ్యూ కలకలం రావడంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడంతో ప్రజా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యాధికారి డాక్టర్‌ నిహాల్‌ తెలిపారు. ఇందులో భాగంగా జ్వర బాధితులు ఉన్న ప్రాంతాల్లో అనుమానితుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజూ ఆశాలు, ఎఎన్‌ఎంలు ప్రత్యేకంగా ఇంటింటికీ వెళ్లి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి డి ఝాన్సీ లక్ష్మి దగ్గరుండి బాధిత ప్రాంతాల్లో ఎబెట్‌, పైరిత్రిన మందు చల్లించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ, నీటి నిల్వలు లేకుండా, దోమలు వద్ధి చెందకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలని సూచించారు.