May 28,2023 22:17

ఎస్‌పికి చిత్రపటాన్ని అందజేస్తున్న అర్చకులు

ప్రజాశక్తి - పాతపట్నం: పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ఆదివారం దర్శించుకున్నారు. బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి, యాత్రికులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని ఎస్‌పి అందజేశారు.