
నిమ్మనపల్లి (చిత్తూరు) : కోవిడ్-19 ను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిరం ఔషద తయారీల సంస్థ తయారు చేసిన ''కోవిషీల్డ్'' వ్యాక్సిన్ గురువారం నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 16 వ తేదీన లాంఛనంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి. నిమ్మనపల్లి పి.హెచ్.సి కి 500 వ్యాక్సిన్ లు వచ్చాయని డ్యూటీలోని ఆసుపత్రి సిబ్బంది ప్రమీలకు అందించిట్లు ప్రత్యేక అధికారి చంద్రశేఖర్, సూపర్వైజర్ శ్రీనివాసులు తెలిపారు. మదనపల్లి నియోజకవర్గ పరిధిలో మదనపల్లి, నిమ్మనపల్లి రెండు కేంద్రాలను వ్యాక్సిన్ కేంద్రాలుగా ఎంపిక చేశామన్నారు. మొదటి విడతలో వైద్య, ఆరోగ్య సిబ్బందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయనున్నట్లు పేర్కొన్నారు.